వరంగల్‌లోనే వారికి ఘోరీ కట్టాలి: ఉత్తమ్

by Shyam |   ( Updated:2021-02-24 05:40:13.0  )
వరంగల్‌లోనే వారికి ఘోరీ కట్టాలి: ఉత్తమ్
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం ప‌ట్టభ‌ద్రుల సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న ప‌ల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉద్యోగ‌, నిరుద్యోగ‌, రిటైర్డ్ ఉద్యోగుల‌కు ఆరేళ్ల కాలంలో రూపాయి ప‌నిచేయ‌లేద‌ని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ధ్వజ‌మెత్తారు. ఈ ఆరేళ్ల కాలంలో కేసీఆర్‌కు గులాంగిరి, చెంచాగిరి చేయ‌డానికే ఆయ‌న‌కు స‌రిపోయింద‌ని అన్నారు. ఒక చిన్న ప్రైవేటు క‌ళాశాల స్థాయి నుంచి వంద‌లు, వేల‌కొట్లు వెన‌కేసుకుని కేసీఆర్ చ‌ల‌వ‌తో ఏకంగా ప్రైవేటు యూనివ‌ర్సిటీనే సంపాదించుకున్నాడ‌ని అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయ‌క్ గిరిజ‌న బిడ్డ అని స్వయంగా సోనియ‌గాంధీ ఆశీర్వాదంతో ఎంపిక‌య్యార‌ని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన చ‌రిత్ర ఆయ‌న‌కుంద‌ని, ప‌ద‌వుల కోసం ఆశ‌ప‌డి భ‌జ‌న చేస్తున్న నాయ‌కుల్లా ఆయ‌న టీఆర్‌ఎస్‌లో కొన‌సాగ‌లేక‌పోయార‌ని అన్నారు.

సీఎం కేసీఆర్ తుగ్లక్ పాల‌న కొన‌సాగిస్తున్నాడ‌ని, వ‌రంగ‌ల్ వ‌స్తే ఔట‌ర్‌రింగ్‌రోడ్డు, డ‌బుల్ బెడ్‌రూం, అండ‌ర్ డ్రైనేజీ అంటూ క‌బుర్లు చెప్పి వెళ్లిపోతాడ‌ని ఎద్దేవా చేశారు. వ‌రంగ‌ల్‌కు ఇచ్చిన అనేక హామీలిచ్చి ఒక్కదాన్ని కూడా నిల‌బెట్టుకోలేద‌ని అన్నారు. చారిత్రక న‌గ‌ర‌మైన‌ వ‌రంగ‌ల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ తీర‌ని అన్యాయం చేశార‌ని అన్నారు. అందుకే వ‌రంగ‌ల్‌లోనే టీఆర్‌ఎస్ పార్టీకి ఘోరీ క‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story