- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేం వింతో.. అక్కడ బీర్ బాటిల్స్‌తో డబుల్ బెడ్ రూం ఇల్లు
దిశ, ఫీచర్స్ : లాక్‌డౌన్ సమయంలో అనేక మంది వివిధ హాబీలను అన్వేషిస్తుండగా, కేరళకు చెందిన అజీ ఆనంద్, అతడి స్నేహితులు పర్యావరణ అనుకూలమైన ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇంజనీర్స్, కార్మికుల అవసరం లేకుండానే 1000 చదరపు అడుగుల స్థలంలో మట్టి, బీరు బాటిల్స్ ఉపయోగించి అద్భుతమైన ఇంటిని నిర్మించారు.
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని పెద్దలు ఊరికే అనలేదు. తమ జీవితాంతం కష్టపడినా కొందరు తమ కలల సౌధాన్ని నిర్మించుకోలేకపోతారు. కన్నూరు నివాసి, క్లాత్స్ స్టోర్‌లో పనిచేసే అజీ ఆనంద్ కూడా ఇందుకు మినహాయింపేం కాదు. అయితే తన పొదుపు డబ్బులను ఉపయోగించి, అతి తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మిస్తే, తన సొంతింటి కల నెరవేరుతుందని అనుకున్నాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు స్నేహితుల సహాయంతో, అజి ఆరు నెలల్లో మట్టితో పాటు, 2,500 బీర్ సీసాలతో సహా వివిధ పదార్థాలను రీసైక్లింగ్ చేసి నిర్మాణం పూర్తి చేశారు.
వెదురు కేన్స్ & బీర్ బాటిల్స్
ఆనంద్ తన ఇంటిని ఎకో ఫ్రెండ్లీగా నిర్మించాలనుకోవడంతో ఆర్కిటెక్చర్ చదువుతున్న కజిన్ ఆకాష్ కృష్ణరాజ్‌ను సంప్రదించాడు. ‘ఎర్త్‌బ్యాగ్ పద్ధతి’ని ఉపయోగిద్దామని సలహా ఇచ్చాడు. ఇది బలమైన నిర్మాణంగా నిలుస్తుందని, వరద ముంపు ప్రాంతాల్లో చాలా మంది దీనిని అనుసరిస్తారని అతడు చెప్పాడు. 2021 నాటికి మట్టి సంచుల్ని, గోడలు, పైకప్పుల మధ్య ఫిల్లింగ్ మెటీరియల్‌గా జోడించడానికి బీర్ సీసాలు, వెదురు బొంగులు సమకూర్చుకున్నాడు.
పునాది, సెప్టిక్, వాటర్ ట్యాంక్ కోసం తవ్విన మట్టితో పాటు, చుట్టుపక్కల నిర్మాణాల నుంచి కూడా మట్టిని సేకరించారు. ఆ మట్టినంత ఆనంద్ అండ్ టీం ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేస్తూ, వాటిని గోడల్లా నిర్మించారు. గోడలు, పైకప్పుల మధ్య గ్యాప్‌ను పూరించడానికి 2,500 బీర్ బాటిళ్లు, వెదురు, కాయిర్ మెటీరియల్‌ని ఉపయోగించారు.
సెకండ్ హ్యాండ్ టెర్రకోట టైల్స్‌తో పైకప్పును తీర్చిదిద్దారు. ఇక తమ ప్రాంతంలో కూల్చివేసిన పాత ఇళ్ల నుంచి స్క్రాప్ కలపను సేకరించి, వాటితో కిటికీ, తలుపులు, అల్మారాలు రూపొందించారు. మొత్తంగా హాల్, కిచెన్, రెండు బెడ్‌రూమ్స్, ఒక బాత్రూమ్‌తో పాటు అటక లాంటి నిర్మాణం కూడా చేశారు. ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులు పూర్తికాగానే గృహప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నారు.