- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలా వ్యాక్సిన్ షేర్ చేస్తాం : ప్రధాని మోడీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్
న్యూఢిల్లీ: అమెరికా కరోనా టీకా షేరింగ్ పాలసీపై ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో గురువారం ఫోన్‌లో మాట్లాడారు. భారత్ సహా ఇతర దేశాలకు తాము అందిస్తున్న టీకాల వివరాలను పేర్కొన్నారు. భారత్ సహకరించే నిర్ణయం తీసుకున్న అమెరికా ప్రభుత్వానికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపినట్టు అనంతరం ట్వీట్ చేశారు. భారత్-అమెరికా పటిష్ట భాగస్వామ్యం, కరోనా మహమ్మారితో దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో క్వాడ్ టీకా కార్యక్రమం గురించి మాట్లాడినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయంగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను భారత్ ఆహ్వానించాలన్న ఆశాభావాన్ని ప్రకటించారు.
వ్యాక్సిన్ షేరింగ్ ప్లాన్ ప్రకటించిన బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జూన్ చివరికల్లా 8 కోట్ల డోసులను ప్రపంచదేశాలకు అందిస్తామని ప్రకటించారు. వీటిని అందించే వ్యూహాన్ని వైట్‌హౌజ్ గురువారం వెల్లడించింది. అమెరికా ప్రకటించిన ఈ మొత్తం టీకాల్లో 75 శాతం కోవాక్స్ ఫెసిలిటీ ద్వారా వెనుకబడిన దేశాలకు అందజేయనుంది. 8 కోట్ల డోసుల్లో తొలి బ్యాచ్‌గా 2.5 కోట్ల డోసులను అందజేస్తున్నది. 60 లక్షల టీకాలను దక్షిణ, మధ్య అమెరికాకు, 70 లక్షల టీకాలను ఆసియాకు, 50 లక్షల టీకాలను ఆఫ్రికాకు అందజేయనుంది. మిగిలిన 60 లక్షల డోసులు అమెరికా భాగస్వాములైన ఇండియా, మెక్సికో, కెనడా, కొరియా, జోర్డాన్, ఇరాక్, యెమెన్, ఈజిప్ట్ సహా ఇతర దేశాలకు సరఫరా చేయనున్నట్టు శ్వేతసౌధం ప్రకటించింది.