కంట్రోల్ తప్పిన రాకెట్.. ఏ క్షణంలోనైనా భూమిపైకి..!

by Anukaran |
కంట్రోల్ తప్పిన రాకెట్.. ఏ క్షణంలోనైనా భూమిపైకి..!
X

న్యూఢిల్లీ: అంతరిక్షంలో చైనా కొత్తగా స్పేస్ స్టేషన్ (తియన్హే) నిర్మించ తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికోసం ఓ మాడ్యూల్‌ను 100 అడుగుల పొడవైన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ మోసుకెళ్లింది. తీసుకెళ్లిన మాడ్యుల్ వదిలిపెట్టాక ఆ రాకెట్ అదుపుతప్పి మళ్లీ భూ కక్ష్యలోకి చేరింది. సాధారణంగా భూ కక్ష్యలోకి ప్రవేశించే గమన వేగాన్ని రాకెట్లు అందుకోవు. కానీ, లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ప్రస్తుతం కంట్రోల్ తప్పింది. తిరిగి భూమిపైకి పడనుంది. అంతరిక్ష పరిశోధకులు, ఆస్ట్రోఫిజిసిస్ట్‌లు రాకెట్ వేగాన్ని, అది ఎక్కడ ల్యాండ్ అయ్యే అవకాశముందన్న లెక్కల్లో మునిగిపోయారు. కానీ, ఇప్పుడే తేల్చడం కష్టమని వివరించారు. మే 8న భూ కక్ష్యలోకి ప్రవేశించే అవకాశముందని చెబుతున్నారు.

యూఎస్ స్పేస్ కమాండ్ ఈ రాకెట్‌ను ట్రాక్ చేస్తు్న్నది. అయితే, భూకక్ష్యలోకి అది చేరే లొకేషన్‌ను ఇప్పుడే తేల్చలేకపోతున్నామని పేర్కొంది. స్పేస్ ట్రాక్ డాట్ ఆర్గ్‌లో రాకెట్ బాడీ లొకేషన్‌పై అప్‌డేట్స్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ రాకెట్ 90 నిమిషాల్లో ఒక సారి భూమినిచుట్టేస్తున్నది. అంటే సెకన్‌కు ఏడు కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తున్నది. అంతరిక్షం నుంచి ఏదైనా భూ వాతావరణంలోకి వచ్చేటప్పుడు ఏర్పడే వేగంతో చాలా వరకు గాలిలోనే మండి మాడిపోతాయి. కానీ, ఇంత భారీ రాకెట్ భూమిని తాకనుందని అంచనాలు వేస్తున్నారు. అయితే, భూమిపైనున్న మహాసముద్రాలు, లేదా నిర్మానుష్య ప్రదేశాల్లోనే అది పడే అవకాశముందని చాలా మంది భావిస్తున్నారు.

Advertisement

Next Story