చైనాపై అమెరికా ప్రతీకార చర్యలు

by vinod kumar |   ( Updated:2020-04-12 01:14:38.0  )
చైనాపై అమెరికా ప్రతీకార చర్యలు
X

కరోనా వైరస్‌పై ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఇప్పటికే చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా, తాజాగా ప్రతీకార చర్యలకు పూనుకుంది. దేశ భద్రత ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అమెరికాలో సేవలందిస్తున్న ‘చైనా టెలికం’ సంస్థపై నిషేధం విధించాలని ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్‌సీసీ)కి ఆ దేశ రక్షణ, హోం, న్యాయ శాఖలు సూచించాయి.
‘ చైనా టెలికం‌తో దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని గుర్తించాం. దేశ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ సంస్థ లైసెన్స్‌లను రద్దు చేయాలి’. అంటూ అమెరికా న్యాయ శాఖ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఒక వేళ అమోదం పొందితే అమెరికాలో లక్షలాది మొబైల్స్ మూగబోనున్నాయి.
చైనా టెలికం సైబర్ నిఘా, ఆర్థిక గూడచర్యం, యూఎస్ కమ్యూనికేషన్ దారి మళ్లింపు వంటి చర్యలకు పాల్పడుతోందంటూ అమెరికాలోని పలు మంత్రిత్వ శాఖలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దీంతో ఈ విషయంపై అధ్యక్షుడు ట్రంప్ కలగజేసుకుని ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Tags: america, china telecom, ban, world news

Advertisement

Next Story