ఆత్మీయ ఆలింగనంతో ఘనస్వాగతం

by Shamantha N |
ఆత్మీయ ఆలింగనంతో ఘనస్వాగతం
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టారు. భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంక ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, ఉన్నతాధికారులు సహా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానం నుంచి దిగగానే ట్రంప్‌కు మోడీ ఆత్మీయ ఆలింగనంతో వెల్‌కమ్ చెప్పారు. ట్రంప్ దంపతులిద్దరిని స్వాగతించారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లు రెడ్ కార్పెట్ పై నడుస్తూ వస్తుండగా.. కళాకారులు భారతీయ సంప్రదాయ కళలతో స్వాగతం పలికారు. డొనాల్డ్ ట్రంప్, మోడీలు తదుపరి కార్యక్రమం రోడ్ షో కు బయల్దేరారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరా (సర్దార్ పటేల్ స్టేడియం)కు చేరనున్నారు. అక్కడ సుమారు లక్ష మంది హాజరైన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఇరువురు నేతలు ప్రసంగించనున్నారు.

Read also..

ఎ‘టాక్’ చేసి..ఏ ‘టాక్స్’ చేస్తడో..

Advertisement

Next Story