‘కథక్’ స్పిన్స్ అదరగొట్టిన హాట్ బ్యూటీ.. వీడియో వైరల్

by Jakkula Samataha |   ( Updated:2023-08-11 09:32:25.0  )
‘కథక్’ స్పిన్స్ అదరగొట్టిన హాట్ బ్యూటీ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెప్పింది. తన లేటెస్ట్ వీడియో సాంగ్ ‘డూబ్ గయే’ 31 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించడంపై అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఏప్రిల్ 30న యూట్యూబ్‌లో సాంగ్ రిలీజ్ కాగా బెస్ట్ కాంప్లిమెంట్స్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఫర్ఫార్మెన్స్ చేసిన ఊర్వశి, ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ స్పెషల్ అకేషన్ పురస్కరించుకుని బ్లూ లెహంగాలో ‘కథక్’ స్పిన్స్ చేసిన భామ అభిమానులను ఆకట్టుకుంది. ‘అతి తక్కువ రోజుల్లో ‘డూబ్ గయే’100 మిలియన్ వ్యూస్‌తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది. జైపూర్ గరన ‘కథక్’ నృత్యంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్ నిర్మించిన ‘డూబ్ గయే’ సాంగ్‌ను గురు రంధ్వా పాడడంతో పాటు ఆల్బమ్‌లో నటించగా బి ప్రాక్ సంగీతం సమకూర్చారు. రెమో డిసౌజా డైరెక్షన్‌లో వచ్చిన వీడియో సాంగ్‌కు జానీ లిరిక్స్ అందించారు.

Advertisement

Next Story