- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరాక్ మ్యాగజైన్‌పై తళుక్కుమన్న బాలీవుడ్ హీరోయిన్!
దిశ, సినిమా: ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్న బాలీవుడ్ హాటెస్ట్ యాక్ట్రెస్ ఊర్వశి రౌతేలా.. తన యూనిక్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకుంటోంది. ఇటీవల ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కోసం హెవీ ఔట్‌ఫిట్ ధరించిన భామ.. ఫ్యాషన్ కోసం ఏం చేసేందుకైనా సిద్ధమేనని పేర్కొంది. తాజాగా ఇరాక్ టాప్ మ్యాగజైన్ కవర్ ఫొటోగా మారిన ఈ బాలీవుడ్ హీరోయిన్.. ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది.
‘బాఘ్‌దాద్’ స్టైల్ స్ట్రీట్ మ్యాగజైన్‌పై తన కవర్ ఫొటో పిక్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఊర్వశి.. ఈ ఫొటోపై ‘ఊర్వశి రౌతేలా.. బాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్’ అనే క్యాప్షన్‌ను చూసి ఆనందపడుతోంది. ఈ మేరకు మ్యాగజైన్ నిర్వాహకులకు థాంక్స్ చెప్తూ.. ఈ గౌరవం దక్కడం పట్ల చాలా ఆనందపడుతున్నానని, ఇరాక్ ఫ్యాషన్ చరిత్రలో తను భాగస్వామినైనట్లు భావిస్తున్నానని పేర్కొంది. కాగా ఇరాక్ నెం.1 మ్యాగజైన్ ‘బాఘ్‌దాద్ స్టైల్ స్ట్రీట్’ కవర్ ఫొటోగా మారిన ఊర్వశికి ఫ్యాన్స్, నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు. తాము ప్రౌడ్‌గా ఫీలవుతున్నామని కామెంట్లు పెడుతున్నారు. చివరగా బాలీవుడ్ మూవీ ‘వర్జిన్ భానుప్రియ’లో కనిపించిన ఊర్వశి రౌతేలా.. తెలుగు, హిందీలో బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ‘బ్లాక్ రోజ్’ షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. అంతేకాదు త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతోంది.
https://www.instagram.com/p/CNE_qkMBx7W/?utm_source=ig_embed