శ్రీదేవి చిన్నకూతురిని లాంచ్ చేసేది ఆయనే!

by Shyam |   ( Updated:2021-01-27 04:03:45.0  )
శ్రీదేవి చిన్నకూతురిని లాంచ్ చేసేది ఆయనే!
X

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్‌ పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఆల్రెడీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇక చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లో రాణించేందుకే మొగ్గు చూపుతుండగా ఆమె త్వరలోనే ఇంట్రడ్యూస్ కాబోతోందని బోనీ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ తను కాకుండా వేరే నిర్మాతలు ఖుషిని లాంచ్ చేస్తారని స్పష్టం చేశాడు. ఇప్పటికే చాలా మంది ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్ ఖుషి లాంచింగ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న క్రమంలో.. జాన్వీని ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం చేసిన కరణ్ జోహారే ఖుషిని కూడా లాంచ్ చేస్తాడని బీ టౌన్ టాక్.

ఖుషీని వచ్చే ఏడాది బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా లాంచ్ చేయాలని చూస్తున్నారట కరణ్, బోనీ. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే ముందే నటనలో ప్రతీ అంశాన్ని నేర్చుకోవాలనుకుంటున్న ఖుషి.. న్యూయార్క్‌లోని స్టార్స్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో సెమిస్టర్ యాక్టింగ్ కోర్సులో అడ్మిషన్ తీసుకుంది. ఈ కోర్సు పూర్తి చేశాకే ఇండస్ట్రీలో ల్యాండ్ అవ్వాలనేది తనతో పాటు కపూర్ ఫ్యామిలీ ఆలోచన అని తెలుస్తోంది. శ్రీదేవి కూడా తన కూతుర్లు మంచి యాక్టింగ్ స్కూల్స్ నుంచి కోర్స్ కంప్లీట్ చేశాకే సినిమాల్లో నటించాలని కోరుకునేదట.

Advertisement

Next Story