ఉపాసన స్వీటెస్ట్ మూమెంట్ ఇదే..

by Jakkula Samataha |
ఉపాసన స్వీటెస్ట్ మూమెంట్ ఇదే..
X

పాసన కొణిదెల… మెగా కోడలు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భార్య. పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ అపోలో బాధ్యతలు చూసుకుంటూ సక్సెస్ ఫుల్ ఉమెన్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు పర్యావరణ పరిరక్షణకై ఉపాసన చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయ్. జంతువులు, పక్షులను శిక్షించొద్దని మెగా కోడలు చేస్తున్న క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా.

ఎప్పుడూ ట్విట్టర్, ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన లైఫ్‌లో స్వీటెస్ట్ మూమెంట్‌ను నెటిజన్లతో పంచుకుంది. చాలామందికి మనకు ప్రాణం పోసి… మొదటగా తమ చేతుల్లోకి తీసుకున్న డాక్టర్లు ఎవరో తెలియదు. అదే తెలిస్తే అంతకన్నా గొప్ప మూమెంట్ ఉండదేమో అనిపిస్తుంది కదా! కానీ ఆ డాక్టరే వచ్చి ఉపాసనను కలిసింది. నేరుగా వచ్చి నేనొవరో తెలుసా నీకు? అని ప్రశ్నించింది. ఆ క్వశ్చన్ తో అయోమయంగా చూస్తున్న ఉపాసనకు ‘నేను డాక్టర్ సరస్వతి .. మీ అమ్మకు డెలివరీ చేసి నిన్ను ఈ లోకంలోకి తెచ్చింది నేనే ‘ అంటూ సమాధానం ఇచ్చింది.

దీంతో హ్యాపీగా ఫీల్ అయిన ఉపాసన ఈ ప్రపంచంలోకి రాగానే తనను మొదటిసారి చూసిన వ్యక్తిని కలవడం ఆనందంగా ఉందని, ఆ స్వీటెస్ట్ మూమెంట్‌ను ఇలా షేర్ చేసుకుంది. ఇలాంటి విషయాలు మన ప్రపంచాన్ని సంతోషంగా మలుస్తాయి అంటూ పోస్ట్ పెట్టింది.

Advertisement

Next Story

Most Viewed