పులిని పెంచాలని ఉంది: ఉపాసన

by Jakkula Samataha |
పులిని పెంచాలని ఉంది: ఉపాసన
X

ఇంటర్నేషనల్ టైగర్స్ డే పురస్కరించుకుని స్పెషల్ పోస్ట్ పెట్టింది ఉపాసన కొణిదెల. పులులు, వాటి జీవనం గురించి అవగాహన పెంచుకోవాలని చెప్పింది. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న అడవిలో పులులు నివసిస్తున్నాయని, వాటికి మన రక్షణ అవసరమని తెలిపింది. పులి పిల్లకు పాలు పడుతున్న ఫొటో పోస్ట్ చేసిన రామ్ చరణ్ సతీమణి..ఇలాంటి పని మళ్లీ చేయాలని కోరుకోవడం లేదని తెలిపింది. పులిని పెంచాలనే ఉత్సాహం ఉన్నా..గణాంకాలు చెప్తున్న దాన్ని బట్టి ఆ పని చేయదలచుకోలేదని చెప్పింది. అడవిలో కంటే కూడా బందీఖానాలోనే ఎక్కువ పులులు ఉన్నాయని..అడవి జంతువులను పెంపుడు జంతువులుగా జంతుప్రదర్శన శాలలో ఉంచడం మంచిది కాదన్నారు.

కరోనా సమయంలో జంతు ప్రదర్శన శాలలో ఒక ఏనుగును దత్తత తీసుకున్నట్లు ఈ సందర్భంగా చెప్పిన ఉపాసన..సందర్శకుల ద్వారా వచ్చే ఆదాయమే పశువుల పశుగ్రాసానికి ఉపయోగపడుతుందని చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూ ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా తెలియడం లేదని..కాబట్టి ఇలాంటి సమయాల్లో మీకు తోచినంత సహాయం చేసి మూగ జీవాలని కాపాడాలని కోరింది.

Advertisement

Next Story

Most Viewed