- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘నేనుగా ఉండేందుకు స్వేచ్ఛ’.. చర్చలో ఉపాసన
దిశ, న్యూస్ బ్యూరో: చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి.. సాధించాల్సిన లక్ష్యాలెన్నో ఉన్నాయని అపోలో లైఫ్ వైస్ చైర్మన్, మెగా కోడలు ఉపాసన కొణిదెల అన్నారు. శుక్రవారం ఫిక్కీ లేడీస్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘నేనుగా ఉండేందుకు స్వేచ్ఛ’ అనే అంశంపై చర్చలో ఆమె పాల్గొన్నారు. ఎంటర్ ప్రెన్యూర్‌గా ప్రసిద్ధిగాంచిన ఉపాసన ఇటీవల సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తున్నారు. సామాజిక అంశాలపై స్పందిస్తోన్నతీరు పట్ల నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ‘నేనుగా ఉండేందుకు స్వేచ్ఛ’ అనే అంశంపై ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఫిక్కీ లేడీస్ హైదరాబాద్ చాప్టర్ చైర్ పర్సన్ ఉషారాణి మన్నె మాట్లాడుతూ.. ఉపాసనతో సంభాషణ అనేది మా పవర్- హవర్ సిరీస్‌లో రెండోదన్నారు. నాయకత్వం, ఫ్యాషన్, సృజనాత్మకతలతో ఉన్నత స్థాయికి చేరుకున్న అంతర్జాతీయ స్థాయి పౌరులుగా ఉండేందుకు దిశా నిర్ధేశం చేసే వ్యక్తులతో నిర్వహించేందన్నారు. సామాజిక ఆశయాలకు ఉపాసన కట్టుబడి పని చేస్తున్నారని కొనియాడారు.