భాగ్యనగరంగా మార్చుతాం : యూపీ సీఎం

by Shyam |   ( Updated:2020-11-28 08:35:26.0  )
భాగ్యనగరంగా మార్చుతాం : యూపీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే కేంద్రం నుంచి అగ్రనేతలను గ్రేటర్ ప్రచారానికి దింపిన బీజేపీ, జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. కాగా శనివారం గ్రేటర్ ప్రచారంలో భాగం అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూకట్‌పల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మార్చుతామని, దానికి అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ ప్రాంతాన్ని నిజాం నవాబు పాకిస్థాన్‌లో కలపాలని చూశాడని, దానికి ఇక్కడి ప్రజలు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. యూపీలో మూడేళ్లలో ముప్పై లక్షల మందికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు అందించామని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆరేళ్లలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చిందని ప్రశ్నించారు.

నిజాం రూపంలో కేసీఆర్ కుటుంబం హైదరాబాద్, తెలంగాణను దోచుకోవాలని చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తుందని, ఆ దోపిడీకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చానని అన్నారు. కేంద్రం నుంచి నేరుగా పేదలకు సంక్షేమ పథకాలు చేరాలంటే బల్దియా ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ భారత నిర్మాణం భారత ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమన్నారు. గత ప్రభుత్వాలకు సాధ్యం కానీ, ట్రిపుల్ తలాక్ , ఆయోధ్య రామమందిర నిర్మాణంన, కశ్మీర్ సమస్య పరిష్కారం ప్రధాని మోదీ చేసి నిరూపించారన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే హైదరాబాద్ మేయర్‌గా బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed