- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉన్నావ్ రేపిస్ట్ భార్యకు బీజేపీ సీటు
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్నావ్ అత్యాచారం కేసు అప్పట్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సేంగర్‌కు 10 ఏళ్లు జైలుశిక్షతో పాటు 10 లక్షలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో కుల్దీప్‌ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేయగా.. జైలుశిక్ష పడటంతో ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు మరోసారి కులదీప్ సింగ్ సేంగర్ హాట్‌టాపిక్‌గా మారారు. యూపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కుల్దీప్ సింగ్ భార్య సంగీత బీజేపీ నుంచి పోటీ చేయనుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్నావ్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఆమె ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తేపూర్ చౌరాసి సీటు నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.
యూపీ పంచాయతీ ఎన్నికలు ఏప్రిల్ 15 నుంచి జరగనుండగా.. మే 2న ఫలితాలు వెలువడన్నాయి. రేప్ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ భార్య బీజేపీ నుంచి పోటీ చేయడంపై ఇప్పుడు విమర్శలొస్తున్నాయి.