- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అద్దెకు ‘అధిక బరువున్న’ వ్యక్తులు
దిశ, ఫీచర్స్ : ఒంటరిగా ఉన్నారా? కంపెనీ కోసం ఓ ఫ్రెండ్ వస్తే అదిరిపోతుందని భావిస్తున్నారా! గర్ల్‌ఫ్రెండ్ లేదని బాధపడుతున్నారా? అర్జెంట్‌గా ఆమె మీ ముందు వాలిపోవాలా! మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నారా? తోడుగా ఒకరుంటే ట్రిప్ బాగుంటుందని ఫీల్ అవుతున్నారా? ఇలా వివిధ ప్రయోజనాల కోసం వ్యక్తులను అద్దెకు ఇవ్వడం జపాన్‌లో కొత్తేమీ కాదు. ప్రతి అవసరానికి వ్యక్తుల్ని గంటల కొద్దీ ‘రెంట్’ తీసుకునే సౌలభ్యం ఇప్పటికే ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో వినూత్న ‘మ్యాన్ సర్వీస్’తో జపాన్ కంపెనీ ముందుకొచ్చింది. మీ అవసరానికి ‘ఫ్యాట్ పీపుల్’ను అద్దెకు తీసుకోమని సూచిస్తోంది.
‘రెంట్ పీపుల్’ సర్వీస్ లిస్ట్‌లో ‘ఫ్యాట్ పీపుల్’ కూడా చేరిపోయారు. ‘డెబూకారి’ అని పిలిచే ఈ కొత్త సేవ ప్రకారం అధిక బరువున్న వ్యక్తుల్ని గంటకు 2,000 యెన్ ($18)లు చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు. సాధారణంగా జపాన్‌లో అందరూ ఫిట్‌గా ఉంటారు, లావుగా ఉన్నవాళ్లు అందులోనూ 100 కిలోల పైనున్న వ్యక్తులు కొంత అరుదుగా కనిపిస్తారు. కాబట్టి ఆన్‌లైన్ ద్వారా వీరిని అందుబాటులో ఉంచడం గొప్ప వ్యాపార అవకాశమని రెంటల్ కంపెనీలు భావిస్తున్నాయి. ప్లస్-సైజ్ ఫ్యాషన్ బ్రాండ్ క్యూజిల్లాను స్థాపించిన మిస్టర్ బ్లిస్ ప్రస్తుత డెబూకారి సర్వీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. తన దుస్తుల బ్రాండ్ కోసం ప్లస్ సైజ్ మోడళ్లను కనుగొనటానికి కష్టపడిన బ్లిస్, వారి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాడు.
2017లో అధిక బరువు ఉన్నవారి కోసం ఒక టాలెంట్ ఏజెన్సీని స్థాపించిన బ్లిస్, రిక్రూట్‌మెంట్ ప్రకటించిన వెంటనే సుమారు 45 మంది ఉద్యోగం కోసం వచ్చారు. వాళ్లందరిని క్యూజిల్లా వినియోగదారులుగా నమోదు చేసుకోవడంతో పాటు కొందరిని ఉద్యోగంలో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లకు ఉపాధి కల్పించడంలో భాగంగా అద్దెకు ఇవ్వడం ప్రారంభిస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఫ్యాట్ పీపుల్ ఎందుకు అవసరం? ఎంత సమయం మీకు అద్దెకు కావాలో చెబితే కంపెనీ వారిని అరెంజ్ చేయనుంది. ఉదాహరణకు అధిక బరువు గల స్నేహితుడి కోసం బట్టలు ప్రయత్నించడానికి ఒక మోడల్ అవసరం లేదా మీకు కంపెనీ ఇవ్వడానికి లావుగా ఉన్న వ్యక్తి అవసరం. కంపెనీల కోసం, వాణిజ్యపరమైన ప్రకటన కోసం లేదా డైట్ ప్లాన్‌ను ప్రోత్సహించడానికి అలాంటి వ్యక్తులు అవసరం కావచ్చు.
ఇది సానుకూలమైన, సాధికారక పనిగా పరిగణించాలని కంపెనీ చెబుతోంది. డెబూకారి కోసం దరఖాస్తు చేసే ప్లస్-సైజ్ వ్యక్తులు ‘ఫ్యాట్ పీపుల్’ అని పిలవడంలో ఎటువంటి సమస్య ఉండదని గ్రహించాలి. 100 కిలోల బరువున్న 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు అవకాశముందని కంపెనీ పేర్కొంది. టోక్యో, ఒసాకా, ఐచితో సహా పలు ప్రధాన జపనీస్ నగరాల్లో ఇప్పటికే అధిక బరువు గల వ్యక్తుల జాబితాను డెబూకారి కలిగి ఉంది.