- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్యంతర బడ్జెట్ Vs వార్షిక బడ్జెట్
దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే చాలా మందికి వార్షిక బడ్జెట్ గురించి మాత్రమే తెలుసు. మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటో తెలియని వారు చాలా మంది ఉన్నారు. దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే ఆర్థిక ప్రణాళికను మధ్యంతర బడ్జెట్ లేదా తాత్కాలిక బడ్జెట్ అంటారు. వార్షిక బడ్జెట్, మధ్యంతర బడ్జెట్‌ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం.
మధ్యంతర బడ్జెట్ Vs వార్షిక బడ్జెట్
టైమింగ్:
సాధారణంగా ప్రభుత్వం ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ కాల పరిమితి మొత్తం ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) ప్రభుత్వానికి ఒక రోడ్‌మ్యాప్‌గా ఉంటుంది. అయితే మధ్యంతర లేదా 'ఓట్ ఆన్ అకౌంట్' అనేది తాత్కాలిక బడ్జెట్. ఎన్నికలకు ముందు దీనిని ఆ సమయంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.
ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. ఎన్నికలు పూర్తయ్యాక ఏర్పడే ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఈ తాత్కాలిక బడ్జెట్ ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు నిధులు సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.
పరిధి:
వార్షిక బడ్జెట్ అనేది ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖర్చులు, కేటాయింపులు, ఆదాయాన్ని వివరంగా పేర్కొంటుంది. కానీ మధ్యంతర బడ్జెట్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు, ప్రజా పాలనకు అవసరం అయ్యే ఆర్థిక ఖర్చులు, కేటాయింపులను కొనసాగించడానికి ఉపయోగపడుతుంది.
పథకాల ప్రకటనలు:
వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడానికి కొత్త పథకాలను ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కానీ మధ్యంతర బడ్జెట్‌లో ప్రజల ఓట్లను పొందడానికి కొత్త పథకాలను ప్రకటించడానికి పరిమితి ఉంటుంది. కొన్ని సార్లు ప్రస్తుతం ఉన్న పథకాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది.
పార్లమెంటరీ పరిశీలన:
సాధారణంగా మధ్యంతర, వార్షిక బడ్జెట్లు రెండు కూడా పార్లమెంటరీ పరిశీలనకు లోనవుతాయి. అయితే వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో మాత్రం ఎక్కువగా చర్చ జరుగుతుంది. అలాగే దాని వివరణ కూడా సుదీర్ఘంగా ఉండాల్సి ఉంటుంది. కానీ మధ్యంతర బడ్జెట్‌పై పార్లమెంట్‌లో ఎక్కువగా చర్చ జరగదు. ఎందుకంటే ఇది తాత్కాలిక బడ్జెట్ కావడం వల్ల.
కాలపరిమితి:
మధ్యంతర బడ్జెట్ సాంకేతికంగా ఏడాది చెల్లుబాటును కలిగి ఉంటుంది. అయితే ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు, దీంతో మధ్యంతర బడ్జెట్ వ్యవధి అక్కడితో ఆగిపోతుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్ కాలపరిమితి 2 నుంచి 4 నెలల వరకు ఉంటుంది.
ప్రస్తుత 2024 బడ్జెట్:
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లోక్‌సభ ఎన్నికలు పూర్తయి, ఎన్నికైన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే వరకు ప్రాథమిక అవసరాలకు ఈ బడ్జెట్ అమలులో ఉంటుంది.