- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీయూలో కేంద్రమంత్రి రామ్‌విలాస్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు కొడుకు, లోక్‌జనశక్తి పార్టీ (LJP) జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. కరోనా కాలంలోనూ ప్రజలకు ధాన్యం అందడానికి నిర్విరామంగా పనిచేస్తూ తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ఆరోగ్యాన్ని ఖాతరు చేయలేదని, అందుకే ఇప్పుడు అనారోగ్యం పాలయ్యారని వివరించారు.
ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ పార్టీ శ్రేణులకు భావోద్వేగ లేఖ రాశారు. తన తండ్రి ఇప్పుడు వైరస్‌తో పోరాడుతున్నారని, ఐసీయూలో చికిత్స పొందుతున్న అతన్ని వదిలి బిహార్ రాలేరని తెలిపారు. ఎన్‌డీఏతో ఇంకా సీట్ల పంపకాలపై మాట్లాడలేదని పేర్కొన్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు 2015లో రూపొందించిన ఏడు అంశాలపైనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శలు చేశారు.