- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల ఆందోళన వెనుక రాజకీయ కుట్ర..
దిశ, వెబ్‌డెస్క్: రైతుల ఆందోళన వెనుక రాజకీయ కుట్ర జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు వ్యవసాయ బిల్లుల నెపంతో రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమం పంజాబ్‌కే పరిమితమైనా దేశవ్యాప్తంగా రైతులను కలుస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ కలలో కూడా రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోరన్నారు.
రైతు సంక్షేమం కోసం కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కరెంటు, ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. పంట దిగుబడి పెరిగేలా యూరియాకు వేపపూత వేయించామని తెలిపారు. ఇక తెలంగాణలో ఆరున్నర వేల కోట్లతో ఫెర్టిలైజర్ పరిశ్రమల్ని పునరుద్ధరించామని చెప్పారు. పంటల బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీపై కోపంతోనే భారత్ బంద్‌కు కేసీఆర్ మద్దతిచ్చారన్నారు. కేటీఆర్, కవితలను ఎందుకు ముందస్తు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.