తెలంగాణ విజ్ఞప్తిని పరిశీలిస్తాం: కేంద్రమంత్రి హర్షవర్ధన్

by Shyam |   ( Updated:2021-01-21 11:11:11.0  )
తెలంగాణ విజ్ఞప్తిని పరిశీలిస్తాం: కేంద్రమంత్రి హర్షవర్ధన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర వైద్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ రెండు రోజుల క్రితం కేంద్ర వైద్య మంత్రికి రాసిన లేఖలో పై అంశాలను ప్రస్తావించారు. వీటిని పత్రికల్లో చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకుని స్వయంగా కేంద్ర వైద్య మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిని పరిశీలించాలని, హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో సుమారు 600కోట్ల టీకాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నందున టెస్టింగ్ కేంద్రం అవసరం తప్పనిసరిగా ఉంటుందని కేంద్ర మంత్రితో చర్చించారు.

ఉపరాష్ట్రపతి ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర వైద్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని వెంకయ్యనాయుడికి వివరించారు. ప్రపంచంలో ఇలాంటి కేంద్రాలు ఏడు మాత్రమే ఉన్నాయని, అందువల్ల తెలంగాణ ప్రతిపాదనను అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఉపరాష్ట్రపతిగా చేసిన సూచనను, తీసుకున్న చొరవను ఉన్నత స్థాయిలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed