- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశవ్యాప్తంగా ఉచితంగా టీకా: హర్షవర్దన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకాను ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. వ్యాక్సినేషన్ తొలి దఫాలో భాగంగా మూడు కోట్ల మందికి ఉచితంగా టీకా వేస్తామని చెప్పారు. ఇందులో ఒక కోటి మంది వైద్య సిబ్బంది, రెండు కోట్ల మంది కొవిడ్‌పై ముందుండి పోరాడిన కరోనా యోధులుంటారని వెల్లడించారు. జులై వరకు మరో 27 కోట్ల మంది ప్రాధాన్యతా వర్గాలకు టీకా వేస్తామని వివరించారు.
27 కోట్ల మంది జాబితాను రూపొందిస్తున్నామని వివరించారు. కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్‌ను ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ హాస్పిటల్‌లో ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఢిల్లీలో ఉచితంగా టీకా వేస్తున్నట్టే ఇతర రాష్ట్రాల్లోనూ వేస్తారా? లేక డబ్బులు చెల్లించాల్సి ఉంటదా? అని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ, ‘ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా టీకా ఉచితంగా అందజేస్తాం’ అని వెల్లడించారు.