జగన్ లక్ష్యం ఉన్న నాయకుడు.. కేంద్రమంత్రి ప్రశంసల వర్షం

by srinivas |   ( Updated:2021-05-30 05:09:10.0  )
AP CM Jagan
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసల వర్షం కురిపించారు. విశాఖపట్నంలో నిర్మించిన వెయ్యి పడకల కరోనా హాస్పిటల్‌ను ఇవాళ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ తరహాలోనే జగన్ ఓ లక్ష్యం ఉన్న నాయకుడని పొగడ్తలు కురిపించారు.

రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని తగ్గించడంతో జగన్ కృషి చేస్తున్నారని అభినందించారు. అన్ని రంగాల్లో ముందంజలో దూసుకెళ్తున్న ఏపీ మిగతా రాష్ట్రాలకు స్పూర్తి అని తెలిపారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఏపీలో మెగా మెడికల్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించడం మంచి పరిణామమని కొనియాడారు.

Advertisement

Next Story