- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బడ్జెట్‌లో ప్రజలపై భారం వేయలేదు: అనురాగ్ ఠాకూర్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: బడ్జెట్‌లో ప్రజలపై భారం వేయలేదని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. అగ్రిసెస్‌తో పెట్రోల్, డీజిల్‌పై అదనపు భారం ఉండదని, పన్ను తీవ్రవాదంను అంతం చేసేందుకే కేంద్రం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మహిళలకు మరో కోటి వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న కేంద్రమంత్రి.. సాగు చట్టాలపై రైతులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
మరోవైపు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై స్పందించిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే విక్రయించాలని నీతి ఆయోగ్ చెప్పిందని, ఆ ప్రకారమే ముందకు వెళ్తామని, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచన తమకు లేదన్నారు.
Advertisement
Next Story