భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా

by Shyam |   ( Updated:2023-05-19 09:54:33.0  )
భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా
X

దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన.. చార్మినార్‌ బయల్దేరివెళ్లారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్‌ మండి వరకు అమిత్ షా రోడ్‌ షో కొనసాగుతోంది. తర్వాత బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల సరళి, ప్రజల స్పందన, పోలింగ్ అంశాలపై చర్చించనున్నారు. కాగా, అమిత్ షా చార్మినార్ పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. మరోవైపు అమిత్ షాకు బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

Advertisement

Next Story

Most Viewed