- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇంకా ఒకేరోజు మిగిలి ఉంది. దీంతో పలు పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. ఇప్పటికే కేంద్రం నుంచి అగ్రనేతలను గ్రేటర్ ప్రచారానికి దింపిన బీజేపీ, జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం జీహెచ్ఎంసీలో ప్రచారం నిర్వహించారు. తాజాగా ఆదివారం కేంద్రం హోం మంత్రి అమిత్ షా గ్రేటర్ ప్రచార రంగంలోకి దిగనున్నారు. దీంతో అమిత్ షా నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి చార్మినార్ వద్దకు చేరుకుంటారు.
అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించనున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన ఆలయం వద్దే ఉండి, అనంతరం సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడలో రోడ్ షో నిర్వహిస్తారు. అమిత్ షా వెంట యోగి ఆదిత్యనాధ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉండనున్నారు. అమిత్ షా చార్మినార్ పర్యటన నేపథ్యంలో పాతబస్తీకి భారీగా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు.