- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంఐఎంను పెంచి పోషిస్తుంది టీఆర్ఎస్సే
దిశ ప్రతినిధి, మెదక్: ప్రజాస్వామ్య తెలంగాణకు దుబ్బాక నాంది కావాలని, ఇందుకు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. శుక్రవారం సిద్దిపేట అక్షయ గ్రాండ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 3న జరిగే ఉపఎన్నికల్లో దుబ్బాక ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారని, దుబ్బాక ప్రజల తీర్పు తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయన్నారు. గతంలో మహబూబ్‌నగర్ ఎన్నికల్లో బీజేపీ ఎలా విజయం సాధించిందో ఇక్కడ అదే ఫలితం పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలు నివురుగప్పిన బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ సరళి ఉంటుందని తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తూ కుట్రలు, అధికార దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. దుబ్బాకలో గెలుస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ శాశ్వతం కాదన్న విషయాన్ని టీఆర్ఎస్ గుర్తించుకోవాలని హితవు పలికారు. బీజేపీకి డిపాజిట్ రాదని ప్రతిరోజూ విషప్రచారం చేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చే సహాయంలో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని విమర్శించారు.
గత ఎన్నికల్లో మా అభ్యర్థి ఓడిపోయినా ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అయ్యాడని తెలిపారు. బీజేపీ ప్రజల మద్దతు మీద ఆధారపడి పోటీచేస్తే, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం ఆక్రమాల మీద ఆధారపడి పోటీ చేస్తుందన్నారు. దుబ్బాకలో నిశబ్ద విప్లవం ఉందని, బీజేపీ సానుకూల విజయం సాధిస్తుందన్నారు. 2019లో కాంగ్రెస్‌లో 19 మంది గెలిచి అందులో సగం మంది టీఆర్ఎస్‌లో చేరారని, టీఆర్ఎస్, కాంగ్రెస్ దొందుదొందే, బొమ్మ బొడుసు పార్టీ లాంటివన్నారు. హౌసింగ్ కోసం కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.