మహిళ దారుణ హత్య.. మర్డర్‌కు ముందు ఏం జరిగింది ?

by Sumithra |   ( Updated:2021-03-29 01:18:57.0  )
మహిళ దారుణ హత్య.. మర్డర్‌కు ముందు ఏం జరిగింది ?
X

దిశ మక్తల్ : గుర్తు తెలియని మహిళను హత్య చేసి కాల్చి వేసిన సంఘటన మక్తల్ పట్టణ శివారులోని ఖానాపురం పంపు హౌస్ కాల్వ దగ్గర చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో హత్య చేసినట్టు రక్తపు మరకలు, పగిలిన గాజులు ఉన్నాయి. కంపచెట్ల మధ్యన శవం ఇంకా కాలుతుడడంతో ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు కొందరు కాలుతున్న శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలం దగ్గర తాగి పడేసిన మద్యం బాటిల్ పడి ఉండడాన్ని చూస్తే.. హతుడు, నిందితుడు కలిసి వచ్చే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈసంఘటన లో ఎవరెవరు ఉన్నది అనేదానికి పోలీసులు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. క్లుస్ టీం హత్యాస్థలంలో ఆధారాలను సేకరించారు. ఈ కేసుకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story