గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Shyam |
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ, గజ్వేల్ / ములుగు: సిద్దిపేట జిల్లా నాగిరెడ్డిపల్లి మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్.ఐ రాజేంద్రప్రసాద్ వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపల్లిలోని పెద్ద చెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. గుర్తు తెలియని దుండగులు హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.

Advertisement

Next Story