వాగులో గుర్తుతెలియని మృతదేహం

by Shyam |
వాగులో గుర్తుతెలియని మృతదేహం
X

దిశ, హుస్నాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు మత్తడి పడుతున్నాయి. దీంతో పలు వాగులు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న మోతి తుమ్మెద వాగులో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. స్ధానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృత దేహానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story