- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ కీలక నేతలకు ఊహించని షాక్.. ప్లీనరీలో నో ఎంట్రీ
దిశ, హుజురాబాద్: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో వారికి నో ఎంట్రీ అని చెప్పేసింది అధిష్టానం. పార్టీ కోసం ఆహర్నిషలు కష్టపడుతున్నా.. మీరు మాత్రం రావొద్దని స్పష్టం చేసింది. దీంతో వారంతా ఇక్కడే ఉండిపోతున్నారు. ఇంతకీ ఎవరిని రావొద్దన్నారు, ఎక్కడ ఉండాలని చెప్పారనే సందేహం మీలో కలిగిందా? అదేనండి హుజురాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తోన్న తరుణంలో అక్కడ ప్రచార బాధ్యతల్లో ఉన్న వారిని ప్లీనరీ సమావేశాలకు ఆహ్వానం పంపలేదు. వారికి మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తోంది. హుజూరాబాద్‌లో ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న వారెవరూ కూడా నియోజకవర్గంలో నుంచి కదలవద్దని చెప్పారు.
దీంతో ఇక్కడ మకాం వేసిన టీఆర్ఎస్ ముఖ్య నాయకుల నుండి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రచారినికే పరిమితం కానున్నారు. దీంతో సోమవారం హైదరాబాద్‌లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. గత ఐదు నెలలుగా నియోజకవర్గం ఆంతటా కలియ తిరుగుతున్న వారంతా కూడా ప్రచారానికే పరిమితం కావల్సి వస్తోంది. ఈనెల 30నే పోలింగ్ జరగనున్నందున ప్రచారానికి ఆటంకం కలుగుతోందని భావించిన అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా హుజురాబాద్‌లో పార్టీ శ్రేణులు పనిచేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.