- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బ్రేకింగ్ : రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు
దిశ, తెలంగాణ బ్యూరో/ ములుగు : ములుగు జిల్లా రామప్ప ఆలయానికి ‘యునెస్కో’ గుర్తింపు దక్కింది. రెండేళ్ళ కిందట కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆదివారం చైనాలో జరిగిన సదస్సులో ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. మొత్తం 24 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనగా అందులో 17 దేశాలు మద్దతు పలికాయి. కేవలం నార్వే దేశం మాత్రమే వ్యతిరేకించింది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆధ్వర్యంలో చైనాలో ఆదివారం జరిగిన సదస్సులో రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు ప్రతిపాదనను నిబంధన 22.7 ప్రకారం రష్యా ప్రతిపాదించింది.
పాలంపేటలోని రామప్ప రుద్రేశ్వర ఆలయానికి ఉన్న విశిష్టత, కాకతీయ సామ్రాజ్యానికి చెందిన రాచర్ల సేనాపతి రుద్రయ్య 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ శిల్పకళకు యునెస్కో గుర్తింపు కోసం 2019లో జరిగిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ సదస్సులో భారత్ తరఫున ప్రతిపాదన ఉన్నప్పటికీ ఏకాభిప్రాయం రాకపోవడంతో గుర్తింపునకు నోచుకోలేదు. యునెస్కో గుర్తింపు పొందడానికి కొన్ని నిబంధనల ప్రకారం పలు అంశాలపై క్లారిటీ రావాల్సి ఉన్నదని అప్పట్లో కొన్ని దేశాలు వ్యాఖ్యానించాయి. దాంతో ఆనాడు రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపునకు నోచుకోలేదు.
ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్ సదస్సులో రామప్ప అలయానికి సంబంధించిన అంశాన్ని రష్యా ప్రతిపాదించడం, దాని వెన్నంటే 16 దేశాలు ఆమోదం తెలపడంతో కాకతీయ శిల్పకళకు అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లయింది. ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయ్‌లాండ్, హంగేరీ, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా తదితర దేశాలన్నీ రామప్ప ఆలయానికి మద్దతు పలికాయి. ఒక్క నార్వే దేశం మాత్రమే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది.
‘శాండ్ బాక్స్‘ టెక్నాలజీ ఆధారంగా ఆలయం పునాది నిర్మాణమైందని, ఫ్లోరింగ్ కోసం గ్రానైట్ రాయిని వాడటం, పిల్లర్లతో పాటు ఆలయం దిగువ భాగం నిర్మాణంలో ఎర్రటి ఇసుక రాయిని వాడడం తేలికైన ఇటుకలతో తెల్లని గోపురాన్ని నిర్మించడం, నీటిలో తేలియాడే లక్షణాలు తదితరాలన్నింటిపై ఈ సదస్సులో చర్చ జరగడంతో పాటు కాకతీయ రాజులు 1214 సంవత్సరంలోనే (జనవరి 12న) నిర్మించిన అంశంపై కూడా లోతుగా అధ్యయనం జరిగింది. 17వ శతాబ్దంలో (1819 సంవత్సరం జూన్ 16న) అతి భారీ స్థాయి భూకంపం (రిక్టర్ స్కేలుపై 8.2 స్థాయిలో) వచ్చినా ఆలయానికి ఏ ప్రమాదమూ వాటిల్లలేదనే అంశాన్ని కూడా ఈ సదస్సులో చర్చించినట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.