- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూలైలో తగ్గిన నిరుద్యోగ రేటు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ ఆంక్షలు ఉద్యోగ భారతాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. ఇటీవల పరిస్థితులు నెమ్మదిగా పుంజుకోవడంతో భారత నిరుద్యోగ రేటు జూలైలో నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా దెబ్బతిన్న తర్వాత ఉపాధి రంగం జూలైలో 6.95 శాతంతో కోలుకుంది. ప్రస్తుత ఏడాది మార్చిలో నిరుద్యోగిత రేటు 6.5 శాతం నుంచి ఏప్రిల్‌లో 7.95 శాతంగా, మేలో 11.9 శాతం, జూన్‌లో 9.17 శాతానికి పెరిగాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించింది.
‘జులై నెల నిరుద్యోగ గణాంకాలు దాదాపు పూర్తిస్థాయి పునరుద్ధరణను సూచిస్తున్నాయి. లేబర్ పార్టిసిపేషన్ రేటు, నిరుద్యోగ రేటు, ఉపాధి రేటు అన్ని ఈ ఏడాది మార్చి స్థాయిలకు దగ్గరగా తిరిగి వచ్చాయని’ సీఎంఐఈ ఎండీ, సీఈఓ మహేష్ వ్యాస్ అన్నారు. గ్రామీణ నిరుద్యోగం జూలైలో 6.34 శాతంగా నమోదవగా, మార్చిలో నమోదైన 6.15 శాతానికి చేరువలో ఉంది. పట్టణ నిరుద్యోగ రేటు 8.3 శాతానికి తగ్గినప్పటికీ, మార్చిలో నమోదైన 7.27 శాతంతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. ‘వ్యాపారాల వృద్ధి నేపథ్యంలో మొత్తం పరిశ్రమలు ఉద్యోగ నియామకాలను చేపడుతున్నాయి. జులైలో అనూహ్యంగా నియామకాలకు పరిశ్రమల నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. రెండు, మూడో త్రైమాసికాల్లో నిరుద్యోగ రేటు మరింత తగ్గుతుందని’ జీనియస్ కన్సల్టెంట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పీ యాద్ అన్నారు.