- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల్క సుమన్ ఇలాకాలో నిరుద్యోగి సూసైడ్.. పోలీసులు, TRS నేతల ఓవరాక్షన్
దిశ, చెన్నూర్ : ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరుతూ తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన మహేష్ కొన్నాళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి లోనయ్యారు. ఇక ఉద్యోగం రాదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు.
విషయం తెలుసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించారు. వైద్య సిబ్బందిని అక్కడికే పిలిచి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకొని ఆసుపత్రికి వెళ్లినా గంటల తరబడి జాప్యం చేసే వైద్యులు, పోలీసులు.. గంటల్లోనే నిరుద్యోగి గ్రామానికి వెళ్లి మొత్తం పూర్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగి ఆత్మహత్య విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం ఇమేజ్ డ్యామేజీ అవుతుందన్న ఉద్దేశ్యంతో గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది.