- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం : టీవీ చూస్తున్న కూతురి నోట్లో టవల్ కుక్కి.. ఆ తండ్రి ఏం చేశాడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: ఒక పక్క కరోనా విలయ తాండవం చేస్తున్నా మృగాళ్ల అఘాయిత్యాలు ఆగడం లేదు. లాక్ డౌన్ సమయంలోను మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ తమ కామ కోరికలను తీర్చుకొంటున్నారు. తాజాగా వరుసకు కూతురయ్యే ఓ బాలికను లైంగికంగా వేధించి గర్భవతిని చేశాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.. వివరాలలోకి వెళితే
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కూన మహాలక్ష్మినగర్‌లో రాములు (50) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. వారి పక్క వీధిలోనే రాములు తమ్ముడు కుటుంబం నివసిస్తుంది. వారికి 13 ఏళ్ల కూతురు ఉన్నది . అయితే గతేడాది అక్టోబర్ లో బాలిక టీవీ చూడడానికి పెద్దనాన్న రాములు ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో వావి వరసలు మరిచిన పెదనాన్న తన మరదలి కూతురు నోట్లో టవల్ కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడడు. ఆ తర్వాత కూడా రాములు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది.
అయితే రోజులు గడుస్తున్నా కొద్దీ బాలికల్లో మార్పులు రావడం మొదలయ్యాయి. ఈ నెల 24 న బాలిక తీవ్ర కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా బాలిక గర్భవతని తెలిసింది. దీంతో ఇంటికి వచ్చాక.. తల్లిదండ్రులు గట్టిగా నిలదీశారు. బాలిక భయపడుతూ అసలు విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. పెద్దనాన్న రాములు తనపై అత్యాచారం చేసినట్టు పేర్కొంది.ఇక విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు రాములు ని నిలదీయగా తనకేమి తెలియదని బుకాయించాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం రాములు ఆరోగ్యం బాగోలేని కారణం అతనిని అరెస్ట్ చేయడం కుదరదని పోలీసులు తెలిపారు.