- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్ రైజర్స్‌ను చిత్తు చేసిన లక్నో.. ఖాతాలో మరో విక్టరీ
ఐపీఎల్ సీజన్-15లో కొత్త జట్టు లక్నో సూపర్ జాయంట్స్ అద్భుతం సృష్టిస్తోంది. మాజీ డిఫెండింగ్ టీములు చేతులెత్తేస్తున్న వేళ కొత్త జట్టు వరుస విజయాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన రాహుల్ సేన రెండింటిలో గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్‌పై 12 పరుగుల తేడాతో గెలిచి లక్నో మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది.
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సోమవారం డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా లక్నో సూపర్ జాయంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 13వ లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 170 పరుగుల ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టును లక్నో బౌలర్ల ఘోరంగా దెబ్బతీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో విలియమ్స్ సేన 9 వికెట్లు కోల్పోయి కేవలం 157 పరుగులు మాత్రమే చేయడంతో 12 పరుగుల తేడాతో లక్నో జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ :
ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో తొలి రెండు మ్యాచుల్లో తడబడిన రాహుల్ సోమవారం జరిగిన మ్యాచులో రెచ్చిపోయాడు. కేవలం 50 బంతుల్లో 68 పరుగులు (6 ఫోర్లు, 1సిక్స్)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ మినహా లక్నో టాపార్డర్‌ను సన్ రైజర్స్ బౌలర్లు కుప్పకూల్చగా దీపక్ హుడా 51/33 (3ఫోర్లు,3 సిక్సర్లు)తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. డికాక్-1, లూయిస్-1, మనీశ్ పాండే -11, ఆయుష్ బదోని -19, కృనాల్ పాండ్యా-6, హోల్డర్ -8 పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
అదరగొట్టిన ఆవేశ్ ఖాన్ :
లక్నో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో సన్ రైజర్స్ బ్యాటర్లు తొలుత విజృంభించిన ఆ తర్వాత చతికిలబడ్డారు. 95 పరుగుల వరకు 4 వికెట్లు కోల్పోయిన విలయమ్ సన్ సేన ఆ తర్వాత చేతులెత్తేసింది. బౌలర్లు ఆవేశ్ ఖాన్ 24/4, జేసన్ హోల్డర్ 34/3, కృనాల్ పాండ్యా 27/2తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. చివరి ఓవర్లలో గెలుస్తుందనుకున్న హైదరాబాద్ జట్టును కీలక బ్యాటర్ పూరన్ వికెట్ల తీసి ఆవేశ్ ఖాన్ కట్టడి చేశాడు. ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు పడటంతో లక్నో విజయం ఖాయమైంది.
హైదరాబాద్‌కు రెండో ఓటమి :
సన్ రైజర్స్ జట్టులో టాపార్డర్ అద్భుతంగా రాణించినా లక్నో బౌలర్లు దెబ్బకు ఒక్కసారిగా చేతులెత్తేశారు. ఓపెనర్స్ అభిషేక్ శర్మ 13, విలియమ్ సన్ 16 పరుగులతో సరిపెట్టగా, రాహుల్ త్రిపాఠి 44/30 (5ఫోర్లు, 1సిక్సు)తో చెలరేగాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ 34/24, వాషింగ్టన్ సుందర్ 18 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించినా లక్నో బౌలర్లు ఆవేశ్ ఖాన్, హోల్డర్ మ్యాజిక్ చేయడంతో సన్ రైజర్స్ జట్టు రెండో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
స్కోర్ బోర్డు :
లక్నో సూపర్ జాయంట్స్ : 169/7(20)
ఇన్నింగ్స్ : కేఎల్ రాహుల్ 68(బి) నటరాజన్, డికాక్ 1(బి)వాషింగ్టన్ సుందర్, లూయిస్ 1 (బి) సుందర్, మనీష్ పాండే 11 (బి) రోమారియో షెఫర్డ్, దీపక్ హుడా 51 (బి) షెఫర్డ్, ఆయుష్ బదోని 19 (ఆర్) పూరన్/రోమారియో, కృనాల్ పాండ్యా 6 (బి) నటరాజన్, హోల్డర్ 8 నాటౌట్
వికెట్లు : 8-1,16-2,27-3,114-4,144-5,150-6,169-7
బౌలింగ్ : భువనేశ్వర్ (4-0-25-0), వాషింగ్టన్ సుందర్ (4-0-28-2), రోమారియో షెఫర్డ్ (4-0-42-2), ఉమ్రాన్ మాలిక్ (3-0-39-0), అబ్దుల్ సమద్ (1-0-8-0), నటరాజన్ (4-0-26-2)
సన్ రైజర్స్ హైదరాబాద్ : 157/9 (20)
ఇన్నింగ్స్ : అభిషేక్ శర్మ 13(బి) ఆవేశ్ ఖాన్, కేన్ విలియమ్ సన్ 16(బి) ఆవేశ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి 44(బి) కృనాల్ పాండ్యా, మార్క్రమ్ 12(బి) కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ 34(బి) ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ 18 (బి) హోల్డర్, అబ్దుల్ సమద్ 0(బి) ఆవేశ్ ఖాన్, రోమారియో షెఫర్డ్ 8 నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 1(బి) హోల్డర్, ఉమ్రాన్ మాలిక్ 1 నాటౌట్
వికెట్ల పతనం : 24-1,38-2,82-3,95-4,143-5,143-6,154-7,156-8,157-9
బౌలింగ్ : జేసన్ హోల్డర్ (4-0-34-3),కృనాల్ పాండ్యా (4-0-27-2), ఆవేశ్ ఖాన్ (4-0-24-4), అండ్రూ టై (4-0-39-0), రవి బిష్ణోయ్ (4-0-29-0)