బీసీసీఐని ఆదుకున్న 'అన్అకాడమీ'

by Shyam |   ( Updated:2020-08-25 06:38:19.0  )
బీసీసీఐని ఆదుకున్న అన్అకాడమీ
X

దిశ, స్పోర్ట్స్: యూఏఈ వేదికగా మరి కొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభం కానుండగా సెంట్రల్ స్పాన్సర్ కాంట్రాక్టు నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకున్న విషయం తెలిసిందే. తాము స్పాన్సర్‌గా తప్పుకుంటున్నట్టు ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించిన 24 గంటల్లోనే ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘అన్అకాడమీ’ సెంట్రల్ స్పాన్సర్‌గా కాంట్రాక్టు దక్కించుకుంది. ఇండో-చైనా ఘర్షణలతో పాటు కరోనా వైరస్ కారణంగా పలు కంపెనీలు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నాయి.

టైటిల్ స్పాన్సర్ వీవో, సెంట్రల్ స్పాన్సర్ ఫ్యూచర్ గ్రూప్ తప్పుకున్నాయి. టైటిల్ స్పాన్సర్‌గా ‘డ్రీమ్ ఎలెవెన్’ నియమించబడిన తర్వాత అది సెంట్రల్ స్పాన్సర్‌గా తప్పుకుంది. ఫ్యూచర్ గ్రూప్, డ్రీమ్ ఎలెవెన్ సెంట్రల్ స్పాన్సర్‌గా తప్పుకున్న తర్వాత రెండు స్లాట్లు ఖాళీ అయ్యాయి. టైటిల్ స్పాన్సర్ రేసులో వెనుకబడి కాంట్రాక్టు దక్కించుకోలేక పోయిన ‘అన్అకాడమీ’ మూడేళ్లకు గానూ రూ.130 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తున్నది. బీసీసీఐ త్వరలో ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన చేయనుంది. కాగా గతంలో ఈ స్పాన్సర్ల ద్వారా ఏడాదికి బీసీసీఐకి రూ. 618 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ ఈ సారి 40 శాతం ఆదాయం తగ్గిపోయింది.

గతంలో ఉన్న స్పాన్సర్లు..

1. టైటిల్ స్పాన్సర్ వీవో రూ. 440 కోట్లు

2. అఫీషియల్ పార్ట్‌నర్స్ (సెంట్రల్ స్పాన్సర్) – టాటా మోటార్స్, ఫ్యూచర్ గ్రూప్, డ్రీమ్ ఎలెవెన్ – రూ. 120 కోట్లు

3. అంపైర్ స్పాన్సర్ – పేటీఎం రూ. 28కోట్లు

4. స్ట్రాటజిక్ టైం అవుట్ పార్టనర్ – సీయట్ – రూ. 30 కోట్లు

ప్రస్తుత సీజన్ స్పాన్సర్లు

1. టైటిల్ స్పాన్సర్ – డ్రీమ్ ఎలెవెన్ – రూ. 222 కోట్లు

2. అఫీషియల్ పార్ట్‌నర్స్ – టాటా మోటార్స్, అన్అకాడమీ – రూ. 80 కోట్లు

3. అంపైర్ స్పాన్సర్ – పేటీఎం రూ. 28కోట్లు

4. స్ట్రాటజిక్ టైం అవుట్ పార్టనర్ – సీయట్ – రూ. 30 కోట్లు

Advertisement

Next Story

Most Viewed