అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకున్న రైతు

by Shyam |
farmer suicide
X

దిశ, మహబూబాబాద్ రూరల్: అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రోటిబండ తండా శివారు దూదియా తండాలో ఆదివారం చోటుచేసుకుంది. తండావాసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు బిక్కు(45) తనకున్న రెండు ఎకరాల భూమిలో మిరపతోట సాగుచేశాడు. పెట్టుబడి కోసం దాదాపు రెండు లక్షల వరకు అప్పు చేసి ఎరువులు వాడాడు. అయినా, పంట చేతికిరాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. మృతునికి భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ అరుణ్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story