- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమెరికాపై ఐరాస ఆగ్రహం
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాపై ఐక్యరాజ్య సమితి మండిపడింది. కరోనా సంక్షోభ సమయంలో దుందుడుకు చర్యలకు పూనుకోవడం సరికాదని ఆగ్రహించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఆరోపణలు గుప్పిస్తూ.. నిధులు నిలిపేసిన అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఐక్యరాజ్య సమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధులు నిలిపివేయడానికి ఇది సరైన సమయం కాదని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. కొవిడ్-19 మహమ్మారిపై ధనిక, పేద దేశాలన్నీ తిరుగులేని పోరాటం చేస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేయడం మంచి నిర్ణయం కాదని ఆయన చెప్పారు. అమెరికా తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని గుటెరస్ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ సంస్థ ప్రపంచ దేశాలను ముందుగానే అప్రమత్తం చేయడంలో విఫలమైందని.. వైరస్ విసయంలో చైనాతో కలసి కుమ్మక్కైందని ట్రంప్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. చైనాతో కలసి విలువైన సమాచారాన్ని దాచిపెట్టడం వల్లే ప్రపంచం అంతా ప్రమాదకరమైన స్థితిలోనికి నెట్టవేయబడిందని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుడే డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు ఇవ్వమని తేల్చి చెప్పేశారు. కాగా, మానవాళి తీవ్ర సంక్షోభం ఎదుర్కుంటున్న ఈ సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపై నిలబడాలని.. పాత అంశాలను తవ్వి బయటకు తీసి ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం సరికానదని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు అన్ని దేశాలు అండగా నిలవాల్సిన తరుణమని గుటెరస్ పేర్కొన్నారు.
Tags: WHO, UN, america, president donald trump, asked, serious