- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాపై ఐరాస ప్రశంసలు
వాషింగ్టన్ : కరోనాపై పోరాటంలో మిగతా దేశాలకు అండగా నిలిచిన ఇండియాపై ఐక్యరాజ్యసమితి ప్రశంసల జల్లు కురిపించింది. కొవిడ్-19 చికిత్సలో మలేరియా డ్రగ్ అయిన హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను వినియోగిస్తున్న నేపథ్యంలో వాటిని అవసరమైన దేశాలకు అందిస్తూ భారత్ ఆదర్శంగా నిలిచిందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. అగ్రరాజ్యమైన అమెరికాకే కాకుండా బ్రెజిల్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, మారిషస్ దేశాలకు భారత్ చేసిన సాయం శ్లాఘనీయమన్నారు. డొమినిక్ రిపబ్లిక్ దేశం కూడా రెండు లక్షల మాత్రలను భారత్ నుంచి అందుకున్నాయని ఆయన తెలిపారు. ఐరోపా, ఆఫ్రికా దేశాలకు కూడా చేతనైనంత సాయం చేస్తున్న భారత్‌ను అభినందించకుండా ఉండలేమని గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఇక కొవిడ్-19 బాధిత దేశాలకు సాయం చేస్తున్న భారత్‌ను రష్యా కూడా అభినందించింది. తమకు కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు కావాలని రష్యా అభ్యర్థించింది. దీనికి ఇండియా సానుకూలంగా స్పందించింది.
Tags: relief, help, aid, india, greatful, UN