భారత్ లో యూకే ప్రభుత్వం భారీ పెట్టుబడులు..

by Harish |   ( Updated:2021-09-02 12:04:11.0  )
business
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గ్రీన్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో యూకే ప్రభుత్వం 1.2 బిలియన్ డాలర్ల(రూ. 8,770 కోట్ల) పెట్టుబడుల ప్యాకేజీని గురువారం ప్రకటించింది. యూకే 11వ ఎకనమిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్(ఈఎఫ్‌డీ) కార్యక్రమంలో ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది. నవంబర్‌లో యూకే ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే క్లైమెట్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముందు ఈ ప్రకటన వెలువడటం వల్ల భారత్‌లో గ్రీన్ ఎనర్జీ వృద్ధికి దోహదపడుతుందని యూకే ప్రభుత్వం అభిప్రాయపడింది. దీంతో పాటు క్లైమెట్ ఫైనాన్స్ లీడర్‌షిప్ ఇనిషియేటివ్ భారత భాగస్వామ్యాన్ని కూడా యూకే ప్రభుత్వం వెల్లడించింది.

ఇది భారత్‌లో స్థిరమైన మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్ మూలధనాన్ని సమీకరించనుంది. ఈ పెట్టుబడులతో 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యానికి మద్దతుగా నిలవనున్నట్టు బ్రిటిష్ హైకమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022-2026 మధ్య భారత్‌లోని గ్రీన్ ప్రాజెక్టులలో యూకేకు చెందిన అభివృద్ధి ఆర్థిక సంస్థ ఈ తాజా పెట్టుబడులు పెట్టనుంది. అలాగే, భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్‌కు యూకేకు చెందిన మౌలిక సదుపాయాప ప్రాజెక్టుల అథారిటీ మద్దతు ఇవ్వనుంది.

Advertisement

Next Story

Most Viewed