హోదా రద్దు వార్తలు అవాస్తవం

by Shyam |
హోదా రద్దు వార్తలు అవాస్తవం
X

దిశ, పటాన్‌చెరు: గీతంతో సహా దేశవ్యాప్తంగా 123 కాలేజీలకు యూజీసీ ఇచ్చిన యూనివర్సిటీ హోదాను రద్దుచేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ తెలిపారు. కొత్త పేరు కోసం కేంద్ర మానవ వనరుల శాఖకు ఆయా కళాశాలలు దరఖాస్తు చేసుకోవాలంటూ నిరాధార, సత్యదూర కథనాలను కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇవి తప్పుడు కథనాలని తెలియని పలువురు వాటిని యథాతథంగా ఇతరులతో పంచుకుంటున్నారని తెలిపారు. దీని వల్ల అది గీతం ప్రతిష్ఠ, గౌరవాలకు భంగం కలిగిస్తోందన్నారు. దీనితో పాటు పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో గీతం విశ్వవిద్యాలయంపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రా సైబర్ క్రైమ్ పోలీసులకు రిజిస్ట్రార్ డి.గుణశేఖర్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి దురుద్దేశ పూరితంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి ఐపీసీ 1860, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం శిక్షించాలని కోరామన్నారు.

Advertisement

Next Story

Most Viewed