"ఆగ మాగమై మూగ బోకు" కోకిల గానం లా దూసుకుపో"

by Shyam |   ( Updated:2021-04-12 03:11:52.0  )
ఆగ మాగమై మూగ బోకు కోకిల గానం లా దూసుకుపో
X

దిశ సిద్దిపేట: ఉగాది పండుగను పురస్కరించుకుని సిద్దిపేటలో సోమవారం ‘ఉగాది ఉత్సహం వసంతం’ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం లాంఛనంగా ఆవిష్కరించారు. ముందుగా శ్రీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు తెలిజేస్తూ.. పండుగలు సంస్కృతి శోభనుపెంచి సమాజాలను కళావంతం చేస్తాయన్నారు. ప్రకృతి పరవశించి బీదవాని గుండెల్లో దిగులు దులుపే ప్లవనామ సంవత్సరం “ఉగాది” పర్వదినం’ వికారాలను తరుమ షడ్రుచుల పచ్చడి నవధాన్యాలను మనకు కానుకగా తెచ్చేవన్నారు.

పంచాంగ శ్రవణంతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయిస్తుంది. “ఆగ మాగమై మూగ బోకు” కోకిల గానం లా దూసుకపో” ఐకమత్యమే ఉగాది మనకు” ప్రపంచ నలువైపులా ఆరోగ్యం శాంతి భద్రతలు ఆనందాలు వెల్లివిరియాలని,కోట్ల గుండెల అమూల్య ఐకమత్య ఖజానాల నా తెలంగాణ అస్తిత్వం అని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం, రహీం, ముస్తఫా మెరాజ్బేగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed