- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌కు ఫోటో ఐడీగా యూడీఐడీ కార్డు..
న్యూఢిల్లీ: కొవిన్ 2.0లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌లో వికలాంగులకు ఉపయోగపడేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొవిన్‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ సమయంలో యూనిక్ డిసబిలిటీ ఐడెంటెటీ కార్డు(యూడీఐడీ)ను కూడా ఫోటో ఐడీగా గుర్తించనున్నట్టు కేంద్రం సోమవారం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. కాగా గతంలో వ్యాక్సినేషన్‌కు ముందు కొవిన్ 2.0లో లబ్దిదారుల వెరిఫికేషన్ కోసం ఏడు ఫోటో ఐడీ కార్డులను మాత్రమే కేంద్రం అంగీకరించేది. తాజాగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం యూడీఐడీ కార్డును అనుమతిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనీ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలో కేంద్రం సూచించింది. దీనికి అవసరమైన నిబంధనలను ప్రస్తుతం తయారు చేస్తున్నట్టు తెలిపింది. ఈ వివరాలు త్వరలోనే కొవిన్ లో అందుబాటులోకి వస్తాయని వివరించింది.