అంత్యక్రియలకు వెళ్తుండగా… రోడ్డు ప్రమాదం

by Sumithra |
అంత్యక్రియలకు వెళ్తుండగా… రోడ్డు ప్రమాదం
X

దిశ, అచ్చంపేట: నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్, మద్దిమడుగు ప్రధాన రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా మరొక వ్యక్తికి తలకు బలమైన గాయాలయ్యాయి. వివరాళ్లోకి వెళితే… అమ్రాబాద్ వైపు నుంచి మన్ననూర్ గ్రామంలో అంత్యక్రియలకు హాజరు కావడానికి బైకుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పురుగుల గుట్ట ప్రధాన రహదారి వద్ద వెనక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకుల రాములు(40) అనే వ్యక్తికి తలకు బలమైన గాయం కాగా, రాజు మరియు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ క్రమంలో రాములు చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story