ఒకే కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు.

by Shyam |
ఒకే కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు.
X

దిశ,మునుగోడు: ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగాలను సంపాదించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన బొమ్మ నరసింహ, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు బొమ్మ కిషోర్, కిరణ్ ఉన్నారు. వీరిద్దరూ ఇటీవల ప్రకటించిన టీఎస్ఎస్పీడీసీఎల్ ఫలితాల్లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలను సంపాదించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. వ్యవసాయం చేస్తూ తమ తల్లిదండ్రులు కష్టపడి తమను చదివించారని తెలిపారు. తమ తల్లిదండ్రులు నేర్పించిన క్రమశిక్షణతో పట్టుదలతో చదవడం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు.

Advertisement

Next Story