రోడ్‌ టెర్రర్.. ఇద్దరి ప్రాణం తీసిన ఆర్టీసీ బస్సు

by Aamani |   ( Updated:2021-12-02 08:25:59.0  )
రోడ్‌ టెర్రర్.. ఇద్దరి ప్రాణం తీసిన ఆర్టీసీ బస్సు
X

దిశ, బెల్లంపల్లి: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన సోమగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం జరిగింది. మంచిర్యాల డిపో నుంచి కాగజ్‌గర్ వెళ్తున్న క్రమంలో కల్వరి చర్చి వద్ద ముందుగా వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న కాగజ్‌నగర్‌కు చెందిన నల్ల లక్ష్మి (45) చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న గోపాలపల్లి సంతోష్‌కి తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సంతోష్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story