అదుపుతప్పి బైక్ బోల్తా..ఇద్దరు మృతి

by Sumithra |   ( Updated:2020-03-07 22:55:22.0  )
అదుపుతప్పి బైక్ బోల్తా..ఇద్దరు మృతి
X

దిశ,మహబూబ్ నగర్: అతివేగంగా వెళ్తున్న బైకు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఇద్దు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మృతులు స్నేహ కంపెనీలో పని చేసేవారిగా గుర్తించారు.అందులో ఒకరు వంశీచందర్ రెడ్డి, మరోకరు మాదాసి పల్లి గ్రామానికి చెందిన రాజేశ్‌గా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి కేసు నమోదుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story