రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు మృతి

by Sumithra |   ( Updated:2021-05-18 23:21:56.0  )
రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్ : తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. చెన్నై‌లోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 15 అడుగుల భారీ గేట్‌ను పక్కకు జరుపుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న రైల్వే ఇంజినీర్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గేట్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు.

Advertisement

Next Story