జల్లికట్టు వేడుకలో అపశృతి.. ఇద్దరు దుర్మరణం

by Anukaran |
జల్లికట్టు వేడుకలో అపశృతి.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో సంక్రాంతికి పండుగకు ప్రతి యేటా నిర్వహించే జల్లికట్టు (ఎద్దుల పరుగు పోటీలు) సాంప్రదాయంలో అపశృతి చోటుచేసుకుంది.ఆదివారం కృష్ణగిరి జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు వేడుకకు చుట్టు పక్కల నుంచి జనాలు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు దుర్మరణం పాలవ్వగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Advertisement

Next Story