దర్భంగా పేలుడు కేసులో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్…

by Sumithra |   ( Updated:2022-08-19 08:05:07.0  )
దర్భంగా పేలుడు కేసులో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్…
X

దిశ, వెబ్‌డెస్క్: దర్భంగా పేలుడు కేసులో మరో ఇద్దరు ఉగ్రవాదులను యూపీలో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. అరెస్టు చేసిన ఇద్దరు సలీం, కాఫిల్ లు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా గుర్తించారు. హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో ఎన్ఐఏ అధికారులు వీరిని అరెస్టు చేశారు. గత నెల 16 న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఇద్దరు ఉగ్రవాదులు బీహార్ లోని దర్బంగా రైల్వేస్టేషన్ కు వస్త్రాల పార్శిల్ పంపించగా.. దర్బంగా రైల్వేస్టేషన్ ఈ పార్శిల్ తీస్తునప్పుడు పేలుడు జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed