- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గమ్యం చేరేలోపే.. అనంత లోకాలకు
స్వస్థలాలకు చేరాలన్న ఉత్సాహంతో ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎలాగైనా సొంతవారిని చూడాలన్నఆత్రుతతో అప్పటికే చాలా దూరం నడిచారు. తీర గమ్యస్థానం చేరేలోపే వారిని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఇది ప్రస్తుతం దేశంలో వలస కూలీల పరిస్థితి. హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. హర్యానాలోని అంబాలా వద్ద కంటోన్మెంట్ రోడ్డుపై బీహార్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలోనే కారు అదుపు తప్పి వారిని ఢీ కొట్టింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి వద్ద చోటుచేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న శివకుమార్ (25) అనే వలస కార్మికుడిని కారు ఢీ కొట్టడంతో అక్కిడికక్కడే చనిపోయాడు. కాగా, గత నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలో గూడ్స్ రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.